. telanganageneralstudies World Literacy Day: Importance, History, and Bridging the Digital Divide

World Literacy Day: Importance, History, and Bridging the Digital Divide

World Literacy Day: Bridging the Digital Divide

అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం

అక్షరాస్యత - మానవ హక్కు మరియు అభివృద్ధికి పునాది

World Literacy Day

చరిత్ర మరియు ప్రాముఖ్యత

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటాము. 1966లో యునెస్కో (UNESCO) దీనిని అధికారికంగా ప్రకటించింది. వ్యక్తులు, సమాజం మరియు దేశాభివృద్ధికి అక్షరాస్యత ఎంత అవసరమో గుర్తుచేయడమే ఈ రోజు ఉద్దేశ్యం.

ఈ ఏడాది థీమ్: "Literacy for Human-Centered Recovery: Bridging the Digital Divide"

డిజిటల్ విప్లవం మరియు అక్షరాస్యత

కోవిడ్ మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్త విద్యావ్యవస్థ దెబ్బతింది. ముఖ్యంగా డిజిటల్ అక్షరాస్యత లేకపోవడం వల్ల చాలామంది విద్యార్థులు వెనుకబడిపోయారు. డిజిటల్ విభజనను (Digital Divide) తొలగించి, అందరికీ సమానమైన విద్యావకాశాలను కల్పించడమే ప్రస్తుత తక్షణ కర్తవ్యం.

భారతదేశంలో అక్షరాస్యత పరిస్థితి

2011 జనాభా లెక్కల ప్రకారం, భారతదేశ అక్షరాస్యత రేటు 74.04%. గత దశాబ్దంతో పోలిస్తే ఇది 9.2% పెరిగింది. అయితే, దేశం పూర్తిగా అక్షరాస్యతను సాధించడానికి మరికొన్ని దశాబ్దాలు పట్టే అవకాశం ఉందని అంచనా.

Post a Comment

0 Comments